Psaumes 61

Conduis-moi sur le rocher plus haut que moi

1ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలతో పాడేది. దావీదు కీర్తన దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన శ్రద్ధగా విను. 2నా ప్రాణం తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొరపెడతాను. నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండ పైకి నన్ను ఎక్కించు. 3నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు.

4యుగయుగాలు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల కింద దాక్కుంటాను. సెలా. 5దేవా, నువ్వు నా మొక్కుబడులు అంగీకరించావు. నీ నామాన్ని గౌరవించే వారికిచ్చే వారసత్వాన్ని నాకు అనుగ్రహించావు. 6రాజుకు దీర్ఘాయువు కలుగజేస్తావు గాక, అతని సంవత్సరాలు తరతరాలు నడుస్తాయి గాక.

7అతడు నిత్యం దేవుని సన్నిధిలో నివసిస్తాడు గాక. అతని కాపుదల కోసం నీ కృపాసత్యాలను నియమించు. 8ప్రతి రోజూ నా మొక్కుబడులు నేను చెల్లించేలా నీ నామాన్ని నిత్యం కీర్తిస్తాను.

Copié !
Aa