Römer 11

Ein Rest, erwählt aus Gnade

1అలాగైతే నేనడిగేది ఏమిటంటే, దేవుడు తన ప్రజలను విడిచి పెట్టేశాడా? కానే కాదు. నేను కూడా ఇశ్రాయేలీయుణ్ణే, అబ్రాహాము సంతానంలో బెన్యామీను గోత్రంలో పుట్టాను. 2తాను ముందుగానే ఎరిగిన తన ప్రజలను దేవుడు విడిచి పెట్టలేదు. ఏలీయా గురించిన లేఖనభాగం చెప్పింది మీకు తెలియదా? అదేవిధంగా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా దేవునితో విన్నవించుకొన్నాడో తెలియదా? 3“ప్రభూ, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను పడదోశారు. నేనొక్కడినే మిగిలాను. వారు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు.” 4అయితే అతనికి దేవుడిచ్చిన జవాబు వినండి, “బయలుకు మోకరించని 7,000 మంది పురుషులు నాకున్నారు.” 5అప్పటి కాలంలోలాగా ఇప్పుడు కూడా కృప మూలమైన ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉంది.

6అది కృప వలన జరిగినదైతే అది క్రియల మూలమైనది కాదు. అలా కాకపోతే కృప ఇంక కృప అనిపించుకోదు. 7అప్పుడేమైంది? ఇశ్రాయేలు ప్రజలు దేనినైతే వెదికారో అది వారికి దొరకలేదు, దేవుని కృప ద్వారా ఎన్నికైన వారికే అది దొరికింది. మిగిలినవారు తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. 8దీని గురించి, “నేటి వరకూ దేవుడు వారికి స్పష్టతలేని మనసు, చూడని కళ్ళు, వినని చెవులు ఇచ్చాడు” అని రాసి ఉంది.

9దీనికి దావీదు ఏమన్నాడంటే, “వారి భోజనం వారికి ఒక వలగా, ఒక బోనుగా, ఒక అడ్డుబండగా, ఒక ప్రతీకార చర్యగా ఉండు గాక. 10వారు చూడలేకుండేలా వారి కళ్ళకు చీకటి కమ్ము గాక. వారి వీపులు ఎప్పుడూ వంగిపోయి ఉండు గాక.”

Eingepfropfte Zweige

11కాబట్టి నేనడిగేది ఏమిటంటే, వారు పడిపోవడం కోసమే తొట్రుపడ్డారా? అలా కానేకాదు. వారి తొట్రుపాటు వలన యూదేతరులకు పాపవిమోచన కలిగి, అది యూదులు రోషం తెచ్చుకోడానికి కారణమైంది. 12వారి అపరాధం లోకానికి, వారి నష్టం యూదేతరులకు ఐశ్వర్యంగా ఉంటే, వారి పరిపూర్ణత ఇంకెంత ఎక్కువ ఐశ్వర్యకరమౌతుందో! 13యూదేతరులైన మీతో నేను మాట్లాడుతున్నాను. నేను యూదేతరులకు అపొస్తలుడుగా ఉన్నందుకు నా పరిచర్య విషయంలో అతిశయిస్తాను.

14ఎలాగైనా నా రక్తసంబంధులకు రోషం కలిగించడం ద్వారా వారిలో కొందరినైనా రక్షించాలని నా కోరిక. 15వారు తిరస్కారం పొందడం లోకాన్ని దేవునితో సమాధానపరచడం అయితే, వారిని స్వీకరించడం చనిపోయిన వారు సజీవులుగా లేచినట్టే అవుతుంది గదా? 16ముద్దలో మొదటి పిడికెడు పవిత్రమైతే ముద్దంతా పవిత్రమే. వేరు పవిత్రమైతే కొమ్మలు కూడా పవిత్రమే.

17అయితే కొమ్మల్లో కొన్నిటిని విరిచి వేసి, అడవి ఒలీవ కొమ్మలాంటి నిన్ను వాటి మధ్య అంటు కట్టి, ఒలీవ చెట్టు సారవంతమైన వేరులో నీకు భాగం ఇస్తే, 18నీవు ఆ కొమ్మల పైన విర్రవీగ వద్దు. ఎందుకంటే వేరే నిన్ను భరిస్తున్నది గాని నీవు వేరును భరించడం లేదు. 19అందుకు, “ఆ కొమ్మలను విరిచింది నన్ను అంటు కట్టడానికే” అని నీవు చెప్పవచ్చు.

20నిజమే. వారి అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయడం జరిగింది. నీవైతే విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉన్నావు. నిన్ను నీవు హెచ్చించుకోక, భయం కలిగి ఉండు. 21ఎందుకంటే దేవుడు సహజమైన కొమ్మలనే వదల్లేదంటే నిన్ను కూడా వదలడు గదా! 22కాబట్టి దేవుని అనుగ్రహాన్ని, ఆయన కాఠిన్యాన్ని చూడు. అంటే ఆయన ఒక వైపు పడిపోయిన యూదుల మీద కాఠిన్యం చూపించాడు. మరొకవైపు నీవు ఆయన దయలో నిలిచి ఉంటే నీ మీద తన అనుగ్రహాన్ని చూపించాడు. నీవు అలా నిలిచి ఉండకపోతే నిన్ను కూడా నరికివేస్తాడు.

23అంతేకాక, వారు తమ అవిశ్వాసంలో కొనసాగకుండా వెనక్కి తిరిగితే వారిని తిరిగి అంటు కడతాడు. దేవుడు వారిని మళ్ళీ అంటు కట్టడానికి సమర్ధుడు. 24ఎలాగంటే, నిన్ను ఒక అడవి ఒలీవ చెట్టు నుండి కోసి, అసహజంగా మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టగలిగిన వాడు సహజమైన కొమ్మలను మరి నిశ్చయంగా తమ సొంత ఒలీవ చెట్టుకు అంటుకట్టగలడు కదా!

Ganz Israel wird gerettet werden

25సోదరులారా, మీకు మీరే తెలివైన వారని తలంచకుండా ఉండాలని ఈ రహస్య సత్యాన్ని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. అదేమంటే, యూదేతరుల ప్రవేశం సంపూర్ణం అయ్యే వరకూ ఇశ్రాయేలు ప్రజల్లో కొందరి హృదయాలు కఠినమయ్యాయి. 26“విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. 27నేను వారి పాపాలను తీసివేసేటప్పుడు వారితో నేను చేసుకొనే నిబంధన ఇదే” అని రాసి ఉన్నట్టు ఇశ్రాయేలు ప్రజలంతా రక్షణ పొందుతారు.

28సువార్త విషయమైతే మిమ్మల్ని బట్టి వారు ద్వేషించబడి ఉండవచ్చు గానీ, దేవుని ఎన్నిక విషయమైతే పితరులను బట్టి వారు దేవునికి ప్రియమైన వారు. 29ఎందుకంటే, దేవుని కృపావరాలు, ఆయన పిలుపు విషయాల్లో ఆయన మార్పు లేని వాడు. 30గతంలో మీరు దేవునికి అవిధేయులు. ఇప్పుడు యూదుల అవిధేయత మూలంగా మీరు కనికరం పొందారు.

31అలాగే మీపై చూపిన కనికరాన్ని బట్టి ఇప్పుడు కనికరం పొందడం కోసం, వారు ఇప్పుడు అవిధేయులుగా ఉన్నారు. 32అందరి పైనా తన కనికరం చూపాలని, దేవుడు అందరినీ లోబడని స్థితిలో మూసివేసి బంధించాడు.

Die Tiefe des Reichtums Gottes

33ఆహా, దేవుని తెలివి, జ్ఞానాల ఐశ్వర్యం ఎంత లోతైనది! ఆయన తీర్పులను పరీక్షించడం ఎవరి తరం. ఆయన మార్గాలు మన ఊహకు అందనివి. 34“ప్రభువు మనసు తెలిసిన వాడెవడు? ఆయనకు సలహాలు ఇచ్చేదెవరు? 35ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇవ్వగలవాడెవడు?” 36సమస్తమూ ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసం ఉన్నాయి. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక. ఆమేన్‌.

Kopiert!
Aa