Salmos 67

Que los pueblos te alaben

1ప్రధాన సంగీతకారుని కోసం. తీగెల వాద్యాలపై పాడేది. దేవుడు మమ్మల్ని కనికరించి ఆశీర్వదిస్తాడు గాక. ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేస్తాడు గాక 2భూమి మీద నీ మార్గాలు, జాతులన్నిటిలో నీ రక్షణ వెల్లడి అయ్యేలా అలా చేస్తాడు గాక. 3దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలంతా నిన్ను స్తుతిస్తారు గాక.

4ప్రజలు సంతోషంతో ఆనందగానాలు చేస్తారు. ఎందుకంటే నువ్వు జాతులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు. భూరాజ్యాలను ఏలుతావు. 5దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలందరు నిన్ను స్తుతిస్తారు గాక. 6అప్పుడు భూమి దాని ఫలాన్ని ఇస్తుంది. దేవుడు, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు.

7దేవుడు మమ్మల్ని దీవించాడు. భూదిగంతాల ప్రజలు ఆయనలో భయభక్తులు నిలుపుతారు.

¡Copiado!
Aa